రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం
SKLM: ఆముదాలవలస జీఆర్‌పీ పరిధిలోని ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.