ఇందిరా స్ఫూర్తితో మహిళలు ఎదగాలి: సీతక్క

ఇందిరా స్ఫూర్తితో మహిళలు ఎదగాలి: సీతక్క

KMR: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి" కార్యక్రమంలో భాగంగా బిక్నూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని, మహిళలకు బొట్టు పెట్టి సారెలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ 'ఉక్కు మహిళ'గా ఎదగాలని ఆకాంక్షించారు.