ప్రజలకు మరింత సేవ చేస్తా: మాజీ ఎమ్మెల్యే

ప్రజలకు మరింత సేవ చేస్తా: మాజీ ఎమ్మెల్యే

పామర్రు: చాట్లవానిపురంలోని బేతేలు గాస్పల్ చర్చి 11వ వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ పాల్గొన్నారు. దాస్ మాట్లాడుతూ.. నీతి, నిజాయితీతో సత్యమైన మార్గంలో జీవించడమే దైవమార్గం అన్నారు. పామర్రు తొలి ఎమ్మెల్యేగా తను చేసిన సేవలు దానికి నిదర్శనమన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.