హెల్మెట్ లేని ప్రయాణం.. మృత్యువుకు ఆహ్వానం..!

హెల్మెట్ లేని ప్రయాణం.. మృత్యువుకు ఆహ్వానం..!

నెల్లూరు రూరల్ మండలంలో హెల్మెట్ లేకపోవడంతో గోలగమూడి రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరులో పనిచేసే నెల్లూరు వాసి తన స్నేహితుడిని కలిసేందుకు జాతీయ రహదారిపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో 70% మరణాలకు హెల్మెట్ లేకపోవడమే కారణమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టైల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.