HYDలో కుళ్లిన చికెన్ కలకలం
HYD: భరత్‌నగర్‌లో పోలీసులు భారీగా కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కుళ్లిన మాంసాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 352 కిలోల కుళ్లిన చికెన్‌ను పట్టుకున్నారు. హోటళ్లు, ఇతర ఆహార కేంద్రాలకు దీనిని తరలిస్తున్నట్లు సమాచారం. ఆహార భద్రతపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.