వరంగల్‌లో ఓసీ జేఏసీ సన్నాహక సదస్సు

వరంగల్‌లో ఓసీ జేఏసీ సన్నాహక సదస్సు

వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య ఫెడరేషన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఓసీ జేఏసీ సన్నాహక సదస్సు నిర్వహించారు. గట్టు మహేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, మార్వాడి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 11న సుబేదారి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న ఓసీ మహా గర్జనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.