తిరుమలలో సినీ ప్రముఖుల సందడి

తిరుమలలో సినీ ప్రముఖుల సందడి

తిరుమలలో సినీ ప్రముఖుల సందడి నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు.