జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
HYD: నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్‌తో వాహనాలన్నీ నిలిచిపోయాయి. మాదాపూర్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.