ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అమెరికా రంగం సిద్ధం!
ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అమెరికా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతస్థాయిలో అమెరికా బలగాలు మోహరించాయి. యుద్ధం మొదలైన నెలరోజుల తర్వాత యూఎస్ సైనిక బలగాలు భారీగా చేరుకున్నాయి. యుద్ధవిమాన వాహకనౌక USS ట్రిపోలిలో 3,500 మంది మెరైన్స్, సెయిలర్స్ పశ్చిమాసియాకు చేరుకున్నారు.