'ఇసుక రవాణాకు అనుమతులు తప్పనిసరి'
KRNL: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరిలించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని హొళగుంద ఎస్సై దిలిప్ కుమార్ బుధవారం అన్నారు. ముద్దటమాగి గ్రామానికి చెందిన మల్లికార్జున హగరి వేదవతి నుంచి అక్రమంగా ఇసుకను తరిలించి, నిల్వ చేసుకున్నారు. సమాచారం మేరకు RI మహేశ్, వీఆర్వో సురాంజనేయులుతో కలిసి సీజ్ చేసి, రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.