మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు కళాశాల సిబ్బంది సీపీఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా ఉన్నారు.