గంజాయి తాగిన యువకులకు కౌన్సిలింగ్

గంజాయి తాగిన యువకులకు కౌన్సిలింగ్

ప్రకాశం: ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శివరామయ్య దాదాపు 15 మంది గంజాయి తాగుతున్న యువకులను గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీసి, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువకులకు హితబోధ చేశారు. వారిచేత గంజాయి తాగమని ప్రతిజ్ఞ చేయించారు.