మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

సూర్యాపేట: మునగాల మండలం విజయరాఘవాపురం, రేపాల గ్రామాలకు చెందిన కూలీలు మోతె గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మృతుల కుటుంబాలు నిరుపేదలని, వారిని ఆదుకోవాలని అన్నారు.