పత్తి విత్తనాల కొరతతో రైతుల ఆందోళన

ADB: డిమాండ్ ఉన్న విత్తనాల కొరత చూపుతూ వ్యాపారులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఫలితంగా దిగుబడి వచ్చేరకం విత్తనాలు మార్కెట్‌లో దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా రైతులు ప్రతీ ఏటా డిమాండ్ ఉన్న విత్తనాల వైపే మొగ్గు చూపుతారు. అయితే డిమాండ్ ఉన్న పత్తిరకం విత్తనాలకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.