శ్రీకాకుళం జిల్లాకు పిడుగుల ముప్పు

SKLM: ప్రస్తుతం తుఫాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు.