ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకపోతే మరొకరికి అవకాశం

ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకపోతే మరొకరికి అవకాశం

KMM: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంలో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తొలి విడతలో మంజూరైన గృహాలను నిర్మించుకోవటంలో కొందరు లబ్ధిదారులు వెనకడుగు వేస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇల్లు కట్టుకోకపోతే మరొకరికి అవకాశం దక్కుతుంది.