బెంగాల్‌లో అధికారుల బందీ.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

బెంగాల్‌లో అధికారుల బందీ.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారన్న కోపంతో ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను 9 గంటల పాటు బందీలుగా ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని, న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నమని సీజేఐ సూర్యకాంత్ మండిపడ్డారు. అధికారుల వాహనాలపై రాళ్లదాడిని కోర్టు అధికారాన్ని సవాల్ చేయడమేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.