ఇది కేవలం కేసీఆర్ దూరదృష్టి: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో శిశు మరణాల రేటు రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 2011-13లో తెలంగాణలో శిశు మరణాల రేటు 41.2గా ఉండగా, 2021-23 నాటికి అది 18కి పడిపోయిందని తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన 52 శాతం తగ్గుదలను సూచిస్తుందని అన్నారు. ఇది మాయాజాలం కాదని.. కేవలం కేసీఆర్ దూరదృష్టి మాత్రమేనని పేర్కొన్నారు.