VIDEO: రాజంపేటలో తీరని నీటి కష్టాలు
అన్నమయ్య: రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో బోర్ మోటార్ చెడిపోవడంతో వారం రోజులుగా నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారులు 2 రోజులు నుంచి ట్యాంకుతో నీటి సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగడానికి పనికి రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. పాత బోరు స్థానంలో కొత్తది ఏర్పాటు చేసి నీటి కొరతను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.