బాధ్యతలు చేపట్టిన 14 రోజులకే సస్పెండ్
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.కూర్మారావు ఈనెల 17న బాధ్యతలు స్వీకరించారు. నిజాయతీ గల అధికారిగా, సమర్థుడిగా మంచి పేరు ఉంది. ఏరి కోరి స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో డయేరియా ప్రబలటంతో బాధ్యతలు స్వీకరించి 14 రోజులకే ఆయనను సస్పెండ్ చేశారు.