పచ్చదనం పరిశుభ్రతపై క్లాప్ మిత్రులకు శిక్షణ
AKP: పచ్చదనం పరిశుభ్రతపై పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో మండలానికి చెందిన క్లాప్ మిత్రులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. క్లాప్ మిత్రులు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలన్నారు. అలాగే పర్యావరణం పరిరక్షణకు మొక్కలు పెంచాలన్నారు. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా చూడాలన్నారు.