VIDEO: జిల్లా నూతన ఎస్పీగా డి. సునీత బాధ్యతల స్వీకరణ
WNP: జిల్లా ఎస్పీగా సునీత సోమవారం పోలీస్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. నేరాలు, అవినీతి, అనైతిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపారు. పారదర్శక పాలన, సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థలతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.