VIDEO: బురదమయంగా మారిన పాఠశాలకు వెళ్లే రహదారి

MNCL: బెల్లంపల్లి మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలకు వెళ్లే దారి బురదమయంగా మారి విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దారిలో గుంత ఏర్పడి అందులో వర్షం నీరు నిలిచి రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో మరింతగా ఇబ్బంది పడుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సమస్య పరిష్కరించాలన్నారు.