భవాని మాలదారుల ఊరేగింపు

NDL: బేతంచెర్ల నుంచి భవానీ స్వాములు రెండు బస్సులలో విజయవాడకు బయలుదేరారు. మాలాదారులు దీక్ష విరమణ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలినడకన ఊరేగింపును నిర్వహించారు. ప్రతి ఏటా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమణ చేస్తున్నామని వారు తెలిపారు. రెండు బస్సులలో సుమారు 120 మంది విజయవాడకు బయలుదేరారు.