దంపతులమని నమ్మించి.. రూ.14 లక్షలు కాజేశారు..!

దంపతులమని నమ్మించి.. రూ.14 లక్షలు కాజేశారు..!

NTR: మైలవరం మండలం తోలుకోడులో వ్యవసాయం చేస్తామని చెప్పి కొంతమంది పలు కంపెనీలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు.. ఏలూరు జిల్లా నారాయణపురానికి చెందిన తనగాల రుక్మణి, తాడిగడప ప్రసాద్ దంపతులమని నమ్మించారు. పలు కంపెనీల ఏజెంట్ల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.