పేకాట శిబిరంపై పోలీసులు దాడి
ప్రకాశం: సింగరాయకొండ మండలంలో వూళ్ళపాలెం పల్లెపాలెంలో పేకాట సిబ్బందిపై ఎస్సై మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,750 నగదును స్వాధీన పరుచుకున్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలియజేయవలసిందిగా కోరారు.