నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు

నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు

ప్రకాశం: దోర్నాల మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ తరగతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని.. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు విధిగా హాజరుకావాలని ఆయన కోరారు.