ప్రపంచ ఆటిజం అవగాహన సదస్సు
AKP: నర్సీపట్నం బలిఘట్టంలో జడ్పీ హైస్కూల్లో గురువారం ప్రపంచ ఆటిజం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉపాధ్యాయుడు అప్పారావు మాట్లాడుతూ.. ఆటిజం లక్షణాలు రెండు సంవత్సరాలలోగా పిల్లలలో వారి ఎదుగుదలను బట్టి గుర్తించగలం అని పేర్కొన్నారు. మెదడులో నరాలు దెబ్బ తినడం వలన ఆటిజం లక్షణాలు వస్తాయన్నారు.