'గ్రంథాలయ వారోత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలి'
మహబూబాబాద్ జిల్లాలో రేపు శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు జరుగు గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ అధికారి శ్రీలత పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. సంపూర్ణ అక్షరాస్యత గ్రంథాలయాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.