VIDEO: ఎంజీఎం మార్చురీ వద్ద దుర్వాసన

వరంగల్: నగరంలో పేదల ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చుట్టూ 10 జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. గతంలో రోగులను ఎలకలు కొరికిన విషయం తెలిసిందే. గురువారం శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పని చేయకపోవడంతో శవాలను స్ట్రెచర్‌పై పడుకోబెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతం దుర్గంధంగా మారింది.