'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

VZM: 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ జెండాలను పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఇందులో భాగంగా గజపతినగరం MPDO కార్యాలయంలో జాతీయ జెండాను SDPI బొద్దుల ఉపేంద్రకు అందించారు.