బేస్తవారిపేటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రకాశం: బేస్తవారిపేట మండలం చింతలపాలెంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఓ వాటర్ ప్లాంట్ ఆటో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ముగయ్య (35) ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.