నిజాయితీ చాటుకున్న చిరు వ్యాపారి

నిజాయితీ చాటుకున్న చిరు వ్యాపారి

SRCL: నర్సంపేటకు చెందిన ప్రణయ్ అనే భక్తుడు మంగళవారం భీమేశ్వర ఆలయ దర్శనం ముగించుకొని వెళ్తుండగా తన బంగారు బ్రేస్లెట్ పోగొట్టుకున్నాడు. గాంధీనగర్లో సోడా వ్యాపారం చేసే కొంపల్లి రమేశ్‌కు అది లభించగా, వెంటనే ఆయన ఆలయ ఎస్పీఎఫ్ హోంగార్డులకు అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. బాధితుడికి సమాచారం అందించి నగను అందజేయడంతో రమేశ్‌ను భక్తులు, అధికారులు అభినందించారు.