ఆదమరిస్తే.. అంతే

మన్యం: పార్వతీపురం(M) పెదబొండపల్లి గ్రామ సమీపంలో పెట్లగెడ్డ చెరువు రహదారి మలుపు వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని వాహనదారులు గుర్తించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరారు.