మారీసుపేట ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి

GNTR: తెనాలి మారీసుపేట ప్రాంతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ సమస్య అధ్వానంగా ఉండటంతో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, పారిశుద్ధ్యం మెరుగుపరిచి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.