యూజర్లకు జియో మరో షాక్

యూజర్లకు జియో మరో షాక్

ప్రీపెయిడ్ యూజర్లకు జియో మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే రూ.249 ప్లాన్‌ను తొలగించిన జియో.. తాజాగా రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌కూ చరమగీతం పాడింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు 1.5 GB/డే డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలను పొందుతున్నారు. ఇకపై ఈ ప్రయోజనాలు పొందాలంటే రూ.889 పెట్టి రిఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ద్వారా జియోసావన్ ప్రోను ఉచితంగా పొందవచ్చు.