పొగ మంచు ఎఫెక్ట్‌.. విమానాల చక్కర్లు

పొగ మంచు ఎఫెక్ట్‌.. విమానాల చక్కర్లు

AP: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా ఉదయం రెండు విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం కలిగింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిరిండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం.