'అందుకే వైసీపీకి 11 సీట్లే వచ్చాయి'
CTR: MLA థామస్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారని వెదురుకుప్పం టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళీ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన నారాయణ స్వామికి మంత్రి పదవి దక్కినా నియోజకవర్గంలో ఎలాంటి జాబ్ మేళా నిర్వహించలేదన్నారు. వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.