కుప్పం ఎన్నికల బరిలో 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు

CTR: కుప్పం నుంచి ఎన్నికల బరిలో 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు గుర్తులను ప్రకటించామన్నారు.