సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ పట్టణంలోని 16వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.