రచ్చబండ నిర్మాణానికి శంకుస్ధాపన

రచ్చబండ నిర్మాణానికి శంకుస్ధాపన

అల్లూరి: అరకులోయ మండలం బస్కి పంచాయతీ కేంద్రంలో రచ్చబండ నిర్మాణ పనులకు ఆదివారం వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్ పాడి రమేష్‌లు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రచ్చబండ నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయించినట్లు సర్పంచ్ పాడి రమేష్ తెలిపారు. రచ్చబండ అందుబాటులోకి వస్తే గ్రామ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందని అన్నారు.