రాజాంలో యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
VZM: రాజాం మండలం ఇప్పిలి పేట గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను పాలవ్యాన్ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సూర్యనారాయణ, పాసింజర్ సుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని 108లో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.