రెండు రోజుల పాటు త్రాగునీటి సరఫరా బంద్
సత్యసాయి: కదిరి పట్టణానికి పార్నపల్లి చిత్రావతి రిజర్వాయర్ నుంచి దొరిగల్లు, మలకవేముల పంప్ హౌస్‌ల ద్వారా సరఫరా అయ్యే త్రాగునీటి పైప్‌లైన్‌లో 600 మి.మీ ఎంఎస్ పైప్, 500 మి.మీ డీఐ వాల్వ్ మరమ్మతులు జరుగుతున్నందున నవంబర్ 3 నుంచి 4 వరకు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.