YSRకు నివాళులు అర్పించిన షర్మిల
KDP: AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని YSR ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాట్‌లో షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇంఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.