పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల అరెస్టు

పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల అరెస్టు

హనుమకొండ: కాజీపేట మండల కేంద్రంలో ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు. ఇటీవల గత కొద్దిరోజులుగా కొంతమంది ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఏడుగురు వ్యక్తులతోపాటు 24 వేల నగదు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.