తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

NGKL: వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం చారకొండ మండల కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అందుబాటులో ఉండాలని సూచించారు.