మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
VSP: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ చేతుల మీదుగా “విశాఖ బాలోత్సవం–3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్” పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల్లో సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్లో జరిగే ఈ వేడుకను ఈసారి రోటరీ విశాఖ వ్యాలీతో కలిసి నిర్వహిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి జీఎస్ రాజేశ్వరరావు తెలిపారు.