VIDEO: ఉంగుటూరులో ప్రధాన రహదారి పక్కనే కోడి వ్యర్థాలు
కృష్ణా: ఉంగుటూరులో ప్రధాన రహదారి పక్కనే కోడి వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్గంధంతో అక్కడ నిలవలేని పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.