ఆదివాసీల ఇలవేల్పు.. ‘ముసలమ్మ తల్లి’
MHBD: దట్టమైన అడవిలో ఆదివాసీ దేవతగా వెలసిన గుంజేడు ముసల్లమ్మ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2వ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. శాంతి, పంటలాభం కలగాలని కోరుతూ అమ్మవారిని ప్రార్థించడం ఆనవాయితీ. ఏటా జరిగే జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది.