మంత్రితో ఎమ్మెల్యేలు సమీక్ష
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నివాసంలో శనివారం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు పనుల పరిస్థితి, గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.